బీటీ కళాశాల ఆస్తులపై కమిటీ విచారణ

ABN , First Publish Date - 2021-12-31T06:43:40+05:30 IST

మదనపల్లె పట్టణంలోని బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేసుకునేలా అడుగులు ముందుకు పడ్డాయి. చెన్నైలోని బీసీటీ సభ్యుల షరతులతో కూడిన లేఖను ఎంపీ మిఽథున్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కమిటీని నియమించింది.

బీటీ కళాశాల ఆస్తులపై కమిటీ విచారణ
బీటీ కళాశాల ఆస్తులపై విచారణ చేస్తున్న కమిటీ సభ్యులు

మదనపల్లె టౌన్‌, డిసెంబరు 30:  పట్టణంలోని బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేసుకునేలా అడుగులు ముందుకు పడ్డాయి. చెన్నైలోని బీసీటీ సభ్యుల షరతులతో కూడిన లేఖను ఎంపీ మిఽథున్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కమిటీని నియమించింది. ఉన్నత విద్యాశాఖ కడప రీజియన్‌ ఆర్జేడీ నాగలింగారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ స్టాన్లీ జోసెఫ్‌, ప్రభ్వు మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి, తహసీల్దార్‌ శ్రీనివాసులు సభ్యులుగా వున్న కమిటీ గురువారం విచారణ చేపట్టింది.  బీటీ కళాశాలలో కరస్పాండెంట్‌ వైఎస్‌ మునిరత్నమయ్య సమక్షంలో విచారణ కమిటీ పలు అంశాలపై చర్చించింది.  కళాశాలలోని పురాతన భవనాలు, ఆస్తుల వివరాలను ఆరా తీశారు. భవనాల స్థితిగతులు, విలువను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్‌  మాట్లాడుతూ... బీటీ కళాశాలలోని వందేళ్ల పూర్వం నిర్మించిన భవనాలకు ఎటువంటి నష్టం లేకుండా చూడాలని కమిటీ సభ్యులను కోరామన్నారు. బీటీ కళాశాల ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా చూడాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు నవీన్‌, మాఽధవ్‌ తదితరులు ఆర్‌జేడీకి విన్నవించారు. 

Updated Date - 2021-12-31T06:43:40+05:30 IST