‘పల్లె వెలుగు’ బస్సులకు రంగు మారుద్ది

ABN , First Publish Date - 2021-12-07T07:24:35+05:30 IST

ఆర్టీసీ పల్లెవెలుగు బస్సుల రంగు మారనుంది.

‘పల్లె వెలుగు’ బస్సులకు రంగు మారుద్ది
అనంతపురంలో ఓ బస్సుకు వేసిన నూతన రంగులు

జిల్లా యంత్రాంగానికి అందిన ఉత్తర్వులు 

607 బస్సులకు కొత్తరంగులు 


తిరుపతి(కొర్లగుంట), డిసెంబరు 6: ఆర్టీసీ పల్లెవెలుగు బస్సుల రంగు మారనుంది. ఈ మేరకు ప్రధాన కార్యాలయం నుంచి సోమవారం జిల్లా యాంత్రాంగానికి ఆదేశాలు అందాయి. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులకు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులున్నాయి. వీటిలో పసుపు రంగును మాత్రమే తొలగించి.. గచ్చకాయ రంగును వినియోగించనున్నారు. పనిలో పనిగా బస్సు రంగుల డిజైన్‌ను కూడా మార్పులు చేయనున్నారు. జిల్లాలోని 15డిపోలకు సంబంధించి 464 పల్లెవెలుగు సర్వీసులు ఆర్టీసీ ద్వారా, 138 సర్వీసులు అద్దెరూపంలో తిరుగుతున్నాయి. మంగళవారం నుంచి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌కు వెళ్లే బస్సులకు కొత్త రంగులు వేయనున్నారు. ఆరునెలల్లో అన్ని బస్సులకు నూతన రంగులను అద్దనున్నారు. 

Updated Date - 2021-12-07T07:24:35+05:30 IST