జిల్లా వైద్యశాలలో మూతపడిన క్యాంటీన్‌

ABN , First Publish Date - 2021-07-08T06:48:01+05:30 IST

మదనపల్లె జిల్లా వైద్యశాలలో రెండునెలలుగా క్యాంటీన్‌ మూత పడింది. దీంతో టిఫిన్‌, భోజనం కోసం రోగి సహాయకులు, ఆస్పత్రి ఉద్యోగులు బయట హోటళ్లు రెస్టా రెంట్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి.

జిల్లా వైద్యశాలలో మూతపడిన క్యాంటీన్‌
ఆస్పత్రిలో మూతపడిన క్యాంటీన్‌

టెండర్లు ఆహ్వానించడంలో అధికారుల మీనమేషాలు


మదనపల్లె క్రైం, జూలై 7: మదనపల్లె జిల్లా వైద్యశాలలో రెండునెలలుగా క్యాంటీన్‌ మూత పడింది. దీంతో టిఫిన్‌, భోజనం కోసం రోగి సహాయకులు, ఆస్పత్రి ఉద్యోగులు బయట హోటళ్లు రెస్టా రెంట్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. టెండర్‌ను ఆహ్వానించాల్సిన ఆస్పత్రి అధికారులు రేపుమాపంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 150 పడకలున్న ఆస్పత్రికి మదనపల్లె డివిజన్‌ పరిధిలోని 31 మండలాలతో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి  రోజూ 800 నుంచి వెయ్యి వరకు ఓపీకి వస్తుంటారు. ఇన్‌పేషంట్లు వందమందికి పైగా ఉంటారు. దీంతోపాటు 120 పడకలతో కొవిడ్‌ ఆస్పత్రి నడుస్తోంది. ఆస్పత్రిలో ఇన్‌పేషంట్లకు మాత్రమే డైట్‌ నిర్వాహకులు మూడుపూటలా ఆహారం అందిస్తు న్నారు. రోగి కుటుంబీకులు, సహాయకులు, ఇతరులు హోటళ్లకు వెళ్లాల్సి ఉంది. హోటల్‌, రెస్టారెంట్లు ఆస్పత్రికి దూరంగా ఉండడంతో ఇబ్బంది పడుతున్నారు. కాగా క్యాంటీన్‌ టెండర్‌ గడువు ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగిసింది. టెండర్‌ లే కుండా గుట్టుచప్పుడు కాకుండా  తమ వ్యక్తులకు క్యాంటీన్‌ అప్పగించేందుకు అటు ప్రజాప్రతినిధులు, ఇటు ఆస్పత్రి అధికారులు పూనుకున్నట్లు తెలుస్తోంది. దీంతో క్యాంటీన్‌ తెరిచేందుకు ఆలస్యమవుతోందని జనం అంటున్నారు. 

Updated Date - 2021-07-08T06:48:01+05:30 IST