చిగురువాడలో సినీ సందడి
ABN , First Publish Date - 2021-03-24T07:03:36+05:30 IST
తిరుపతి రూరల్ మండలంలోని చిగురువాడలో ఉన్న గేట్ కాలేజీకి మంగళవారం ‘తెల్లవారితే గురువారం’ చిత్ర యూనిట్ వచ్చింది.

గేట్ కాలేజీకి వచ్చిన ‘తెల్లవారితే గురువారం’ చిత్ర యూనిట్
తిరుపతి రూరల్, మార్చి 23: తిరుపతి రూరల్ మండలంలోని చిగురువాడలో ఉన్న గేట్ కాలేజీకి మంగళవారం ‘తెల్లవారితే గురువారం’ చిత్ర యూనిట్ వచ్చింది. చిత్ర కథా నాయకుడు సింహ కోడూరి (మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చిన్న కుమారుడు), హీరోయిన్లు నిషా, చిత్ర శుక్లా, నిర్మాతలు సాయి కొర్రపాటి, రవీంద్ర బెనర్జీలు విద్యార్థులతో కలిసి సందడి చేశారు. ఇది వినోదాత్మక చిత్రమని, యువత తమ చిత్రాన్ని ఆదరించాలని వారు కోరారు. సాంకేతిక నిపుణుల సహకారం అద్భుతంగా ఉండటం వల్ల సినిమా బాగా ఆకట్టుకుంటుందన్నారు. తమ సినిమాకు తిరుమల శ్రీవేంకటేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. అనంతరం నటీనటులతో సెల్ఫీలు దిగడానికి విద్యార్థులు పోటీ పడ్డారు. సినిమాకు సంబంధించి వారడిగిన సరదా ప్రశ్నలకు నటీ, నటులు ఇచ్చిన సమాధానాలు ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్‌కు గేట్ కాలేజీ చైర్మన్ తమ్మినేని వెంకటేశ్వర్లు, తిరుపతి పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు రవినాయుడు, వీరపనేని శివ, పత్తిపాటి వివేక్, రంజిత్ నాయుడు, లోకేష్‌రాజు, శ్రీరామ్ తదితరులు స్వాగతం పలికి, సత్కరించారు.