చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు హౌస్ అరెస్ట్
ABN , First Publish Date - 2021-10-20T13:43:19+05:30 IST
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు నేపథ్యంలో జిల్లాలో ఎక్కడకక్కడ టీడీపీ ముఖ్య నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు నేపథ్యంలో జిల్లాలో ఎక్కడకక్కడ టీడీపీ ముఖ్య నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్సీ దొరబాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ ముఖ్య నాయకులను గృహ నిర్బంధం చేశారు. ప్రస్తుతం హౌస్ అరెస్ట్లు కొనసాగుతున్నాయి.