చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-02-01T17:06:57+05:30 IST

జిల్లాలోని కుప్పం సరిహద్దు ప్రాంతం తమిళనాడు కృష్ణగిరి హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న తమిళనాడు ఆర్టీసీ బస్సును మారుతి ఒమిని ఢీకొట్టింది.

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు: జిల్లాలోని కుప్పం సరిహద్దు ప్రాంతం తమిళనాడు కృష్ణగిరి హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న తమిళనాడు ఆర్టీసీ బస్సును మారుతి ఒమిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా కృష్ణగిరి నుంచి ధర్మపురికి వెళ్తుండగా కావేరిపట్నం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-02-01T17:06:57+05:30 IST