చంద్రబాబు బస చేసే గెస్ట్ హౌస్‌కి పవర్ కట్?
ABN , First Publish Date - 2021-10-29T20:15:14+05:30 IST
కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనతో కోలాహలం నెలకొంది.

చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనతో కోలాహలం నెలకొంది. అధినేతకు స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు బస చేసే ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కి పవర్ కట్ చేసినట్లు సమాచారం. దీంతో అక్కడ జనరేటర్ ఏర్పాటు చేసినట్లుగా తెలియవచ్చింది. దీనిపై విద్యుత్ అధికారులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ విద్యుత్ ఉందని, అయితే ప్రత్యామ్నాంగా జనరేటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గెస్ట్ హౌస్‌కు విద్యుత్ లేదనేది పుకార్లు మాత్రమేనని ఇలాంటి అవాస్తవాలు చెప్పినవారిపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ సిబ్బంది డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు కుప్పం పర్యటనలో విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో.. ఇప్పడలా జరగకూడదనే జనరేటర్‌ను సిద్ధం చేసినట్లు విద్యుత్ సిబ్బంది తెలిపారు.