చిత్తూరు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభం
ABN , First Publish Date - 2021-03-18T17:24:06+05:30 IST
చిత్తూరు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది.
చిత్తూరు: చిత్తూరు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ జరుగుతోంది. మొత్తం 50 డివిజన్లు కలిగి ఉన్న చిత్తూరు కార్పొరేషన్లో 46 మంది వైసీపీ కార్పొరేటర్లు, ముగ్గురు టీడీపీ కార్పొరేటర్లు, ఒక స్వతంత్ర కార్పోరేటర్ పూర్తిస్థాయిలో ఎన్నికకు హాజరయ్యారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు ఎన్నికకు హాజరయ్యారు.