అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌‌ను పట్టుకున్న చిత్తూరు పోలీసులు

ABN , First Publish Date - 2021-07-12T18:34:16+05:30 IST

అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగర్లను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌‌ను పట్టుకున్న చిత్తూరు పోలీసులు

చిత్తూరు: అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగర్‌ను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్‌పై ఎస్పీ సెంధిల్ కుమార్ మాట్లాడుతూ... దస్తగిరి ఇమ్రాన్ ఖాన్ అలియాస్ ఇమ్రాన్ భాయ్ అనే స్మగ్లర్స్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు. రూ.6.2 కోట్ల విలువ చేసే 8.4 టన్నుల బరువు గల 283  ఎర్రచందన దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇమ్రాన్ భాయ్ వద్ద నుండి రెండు వాహనాలు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని ఎస్పీ చెప్పారు. ఎర్రచందన దుంగలను ఇమ్రాన్ భాయ్ ఢిల్లీ,ముంబాయికి అక్రమంగా తరలించే వాడని విచారణలో తేలిందన్నారు. తమిళనాడు రాష్ట్రం, కృష్ణగిరి సమీపంలోని బొమ్మనపల్లెలో ఇమ్రాన్ భాయ్ ఎర్రచందన దుంగలను నిల్వ చేసే గోడౌన్‌పై దాడులు చేసినట్లు తెలిపారు. శేషాచలం అటవీ ప్రాంతంలో కూలీలను పెట్టి ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసేవాడన్నారు. ఎర్రచందన అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సెంధిల్ స్పష్టం చేశారు. 


Updated Date - 2021-07-12T18:34:16+05:30 IST