పిల్లలను నచ్చిన రంగాల్లో ప్రోత్సహించాలి

ABN , First Publish Date - 2021-08-21T08:01:56+05:30 IST

పిల్లలను వారికి నచ్చిన రంగాల్లో ప్రోత్సహించాలని హాకీ క్రీడాకారిణి (గోల్‌కీపర్‌) రజని సూచించారు.

పిల్లలను నచ్చిన రంగాల్లో ప్రోత్సహించాలి
మీడియాతో మాట్లాడుతున్న రజని

తల్లిదండ్రులకు హాకీ క్రీడాకారిణి రజని సూచన


తిరుపతి(రవాణా), ఆగస్టు 20: పిల్లలను వారికి నచ్చిన రంగాల్లో ప్రోత్సహించాలని హాకీ క్రీడాకారిణి (గోల్‌కీపర్‌) రజని సూచించారు. శుక్రవారం తిరుపతికి విచ్చేసిన ఆమెకు స్థానిక ఎంపీ గురుమూర్తి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టోక్యో ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత పురుషుల హాకీలో మెడల్‌ సాధించడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో జరగనున్న ప్రపంచ పోటీలకు సిద్ధమవుతున్నామని, అక్కడ కూడా మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తామని చెప్పారు. టీమిండియాకు ఆడటం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఒలింపిక్స్‌ సెమీఫైనల్‌ సమయంలో ప్రధాని మోదీ ఫోన్‌ ద్వారా టీమ్‌ సభ్యులందరితో మాట్లాడి, ఆత్మస్థైర్యం నింపారన్నారు. సీఎం జగన్‌ తనకు ఆర్థిక సహకారం అందించారన్నారు. భవిష్యత్తులోనూ భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు. జిల్లాలో హాకీ క్రీడను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తన రిటైర్మెంట్‌ తర్వాత కోచ్‌గా ప్రతిభావంతులైన హాకీ క్రీడాకారులను తయారు చేస్తానని స్పష్టం చేశారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. యువతకు రజనీ స్ఫూర్తిదాయకం అన్నారు. క్రీడాకారులుగా రాణించాలంటే పేదరికం అడ్డుకాదని, ప్రతిభ ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సెట్విన్‌ సీఈవో మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-21T08:01:56+05:30 IST