సచివాలయాలు తనిఖీ చేయండి: కలెక్టర్
ABN , First Publish Date - 2021-10-29T06:45:36+05:30 IST
గ్రామ, వార్డు సచివాలయాలను తరచూ తనిఖీ చేయాలని అధికారులను కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు.
చిత్తూరు (సెంట్రల్), అక్టోబరు 28: గ్రామ, వార్డు సచివాలయాలను తరచూ తనిఖీ చేయాలని అధికారులను కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో సచివాలయాల పనితీరు, జగనన్న స్వచ్ఛ సంకల్పం, టిడ్కో గృహా నిర్మాణాలపై సమీక్షించారు. జేసీ (అ) శ్రీధర్ మాట్లాడుతూ.. బయోమెట్రిక్ హాజరు ఒకపూట మాత్రమే వేస్తున్నారని, రెండు పూటలా వేయాలన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీలకు రిజిస్టర్ అమలు చేయాలన్నారు. డీఎంహెచ్‌వో శ్రీహరి, డీసీహెచ్‌ఎస్ సరళమ్మ, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, డీపీవో దశరథరామిరెడ్డి, చిత్తూరు, నగరి, కుప్పం, శ్రీకాళహస్తి, పలమనేరు, పుంగనూరు, పుత్తూరు మున్సిపల్ కమిషన్లు పాల్గొన్నారు.