చట్టాలపై అవగాహనతోనే నేరాలకు చెక్‌

ABN , First Publish Date - 2021-11-09T07:35:27+05:30 IST

ప్రతి పౌరుడూ చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే నేరాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు పేర్కొన్నారు.

చట్టాలపై అవగాహనతోనే నేరాలకు చెక్‌
దిశ స్టాల్‌లో న్యాయమూర్తి, అర్బన్‌ ఎస్పీ తదితరులు

న్యాయవిజ్ఞాన సదస్సులో అర్బన్‌ ఎస్పీ 

న్యాయమూర్తితో కలిసి ఆర్టీసీ బస్టాండులో స్టాళ్ల ప్రారంభం 


తిరుపతి(కొర్లగుంట), నవంబరు 8: ప్రతి పౌరుడూ చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే నేరాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు పేర్కొన్నారు. చట్టాలపై న్యాయ, పోలీసుశాఖ అందిస్తున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆర్టీసీ సెంట్రల్‌ బస్సుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను నాలుగో న్యాయస్థానం జిల్లా అదనపు న్యాయమూర్తి సత్యానందతో కలిసి సోమవారం ఉదయం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోలీస్‌ వ్యవస్థకు అవసరమైన సమాచారాన్ని ప్రజలు అందించిన చోట నేరాలు జరిగే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యక్రమాలు, సంఘవిద్రోహ చర్యలపై పోలీసులకు ప్రజలు సమాచారం అందించాలని కోరారు. ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో దిశపోలీస్‌, సైబర్‌క్రైమ్‌, ఎల్‌.హెచ్‌.ఎం.ఎ్‌స. తదితరాలపై పౌరులకు వారం రోజులపాటు అవగాహన కల్పిస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జిల్లా న్యాయమూర్తి గోపాలకృష్ణరావు, అదనపు ప్రిన్సిపల్‌ జడ్జి శ్రీనివాసరావు, ఏడీఎంఎం న్యాయమూర్తి పవన్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి, డీఎస్పీలు కాటమరాజు (ట్రాఫిక్‌), రామరాజు (దిశా), మురళీకృష్ణ (ఈస్ట్‌), కొండయ్య (కమాండ్‌ కంట్రోల్‌), సీఐలు శివప్రసాద్‌, సుబ్రహ్మణ్యంరెడ్డి, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-09T07:35:27+05:30 IST