రూ.25 లక్షలతో పల్లికొండేశ్వరుడికి రథం
ABN , First Publish Date - 2021-12-31T07:05:59+05:30 IST
సురుటుపల్లిలోని పల్లికొండేశ్వరాలయానికి రూ. 25లక్షలతో నూతన రథం తయారు చేయించేందుకు శ్రీకాళహస్తికి చెందిన బింగిమళ్ళ సురేష్ ముందుకొచ్చారు.

ముందుకొచ్చిన దాత
సత్యవేడు, డిసెంబరు 30: సురుటుపల్లిలోని పల్లికొండేశ్వరాలయానికి రూ. 25లక్షలతో నూతన రథం తయారు చేయించేందుకు శ్రీకాళహస్తికి చెందిన బింగిమళ్ళ సురేష్ ముందుకొచ్చారు. ఈ మేరకు గురువారం ఆలయ చైర్మన్ ఏవీఎం మునిశేఖర్‌రెడ్డిని కలసి అభ్యర్థన పత్రాన్ని అందించారు. రథం చేయించే అవకాశం రావడ ం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, నాలుగు నెలల లోపు రథం తయారు చేయించి ఇస్తానని తెలిపారు. దాతకు ఆలయ చైర్మన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం చేయించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పి.గీతా నారాయణ ఆలయ అర్చకులు గురుకుల్, సిబ్బంది పాల్గొన్నారు.