బెంగళూరుకు బయలుదేరిన చంద్రబాబు

ABN , First Publish Date - 2021-10-31T15:38:21+05:30 IST

చంద్రబాబు కుప్పంలో రెండు రోజుల పర్యటన ముగించుకొని రోడ్డు మార్గం మీదుగా బెంగళూరుకు బయలుదేరారు.

బెంగళూరుకు బయలుదేరిన చంద్రబాబు

చిత్తూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు కుప్పంలో రెండు రోజుల పర్యటన ముగించుకొని  రోడ్డు మార్గం మీదుగా బెంగళూరుకు బయలుదేరారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకొనున్నారు. కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహం ఆవరణంలో బస్సులోనే  రెండు రోజులుగా ఆయన బస చేశారు. రాత్రి 3 గంటల వరకు కుప్పం  పరిధిలో ఉన్న మున్సిపాలిటీ అభ్యర్థులు, వార్డు ఇన్చార్జ్‌లతో సమీక్షించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక అభ్యర్థి గెలవాలని ఆయన సూచించారు. వైకాపా నాయకులు ఎటువంటి  ప్రలోభాలకు గురిచేసినా, భయపెట్టిన  భయపడొద్దని అన్నీ తాను చూసుకుంటానని చంద్రబాబు  భరోసా కల్పించారు.

Updated Date - 2021-10-31T15:38:21+05:30 IST