కొవిడ్‌ నియంత్రణలో కేంద్రం వైఫల్యం

ABN , First Publish Date - 2021-05-30T05:37:38+05:30 IST

కొవిడ్‌ వైరస్‌ను నియం త్రించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా విమర్శించారు. శనివారం ఆయన తన నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ప్లకార్డులతో నిరసన తెలియజేశారు.

కొవిడ్‌ నియంత్రణలో కేంద్రం వైఫల్యం
ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్న షాజహాన్‌బాషా తదితరులు

మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ధ్వజం


మదనపల్లె రూరల్‌, మే 29: కొవిడ్‌ వైరస్‌ను నియం త్రించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా విమర్శించారు. శనివారం ఆయన తన నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి  నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజల్‌ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఽ  పెరిగినా వాటిని నియంత్రిలేకపోయిందని ఆరోపించారు. నోట్ల రద్దు, జీఎస్టీతో ఎంతోమంది పేదలు ఇబ్బందులు పడ్డారన్నారు.  కరోనా కష్టకాలంలో పేదలు ఇబ్బందులు పడుతంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కనీసం వ్యాక్సిన్‌ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు ఇచ్చేందుకు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. దేశంలో ఇంత అసమర్థ పాలన చేస్తున్న ప్రధాని మోదీకి దేశాన్ని పాలించే అర్హతలేదన్నారు. ఆయన వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాడు. అదేవిధంగా సీఎం జగన్‌ రాష్ట్ర ప్రయోజనాలను మోదీ కాళ్ల వద్ద తాకట్టుపెట్టాడన్నారు. ఇప్పటికైనా రాష్ర్టానికి దక్కాల్సిన వాటిపై కేంద్రంతో పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షంషీర్‌, గిరీష్‌, ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-30T05:37:38+05:30 IST