శ్రీకాళహస్తీశ్వరుడి సేవలో ప్రముఖులు
ABN , First Publish Date - 2021-11-21T06:27:52+05:30 IST
వాయులింగేశ్వరుడి దర్శనార్థం పలువురు ప్రముఖులు విచ్చేశారు.

శ్రీకాళహస్తి, నవంబరు 20: వాయులింగేశ్వరుడి దర్శనార్థం శనివారం మాజీ ఐఏఎస్ సత్యనారాయణ, గుంటూరు డీఐజీ త్రివిక్రమవర్మ శనివారం శ్రీకాళహస్తి విచ్చేశారు. ఆలయ ఈవో పెద్దిరాజు ప్రముఖులకు స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరు గురుదక్షిణామూర్తి సన్నిధి చేరుకోగా, వేద పండితులు ఆశీర్వదించి స్వామి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ శ్రీనివాసులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.