శ్రీకాళహస్తీశ్వరుడి సేవలో ప్రముఖులు
ABN , First Publish Date - 2021-10-25T06:18:31+05:30 IST
వాయులింగేశ్వరుడి దర్శనార్థం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దనరెడ్డి, ఈఆర్సీ చైర్మన్ టి.రంగారావు శ్రీకాళహస్తి విచ్చేశారు.

శ్రీకాళహస్తి, అక్టోబరు 24: వాయులింగేశ్వరుడి దర్శనార్థం ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దనరెడ్డి, తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ టి.రంగారావు వేర్వేరు సమయాల్లో శ్రీకాళహస్తి విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రముఖులకు ఆలయ ఈవో పెద్దిరాజు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గురుదక్షిణామూర్తి సన్నిధి చేరుకోగా, వేద పండితులు వీరిని ఆశీర్వదించి స్వామి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.