పామును పట్టుకో..!

ABN , First Publish Date - 2021-01-13T05:34:22+05:30 IST

పాములు కనపడగానే భయంతో పరుగులు తీస్తుంటాం. అలా కాకుండా వాటిని ఎలా హ్యాండిల్‌ చేయాలి? వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఎలా పట్టుకోవాలనే అంశాలపై తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో మంగళవారం స్నేక్‌ షో నిర్వహించారు.

పామును పట్టుకో..!
పాములపై భయాలను పోగొట్టేందుకు సందర్శకులు, జూ అధికారుల చేతికి పాములను పట్టిస్తున్న స్నేక్‌ ఆఫ్‌ సొసైటి వారు

ఎస్వీ జూలో స్నేక్‌ షో 


తిరుపతి(అటవీశాఖ), జనవరి 12: పాములు కనపడగానే భయంతో పరుగులు తీస్తుంటాం. అలా కాకుండా వాటిని ఎలా హ్యాండిల్‌ చేయాలి? వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఎలా పట్టుకోవాలనే అంశాలపై తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో మంగళవారం స్నేక్‌ షో నిర్వహించారు. జూ సిబ్బందికి, సందర్శకులకు ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీ (హదరాబాదు) ఆధ్వర్యంలో పాములపై అవగాహన కల్పించారు. విష సర్పాలు, లేనివి ఏవనే విషయాలను తెలియజేశారు. పాములను చాకచక్యంగా పట్టుకోవడంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. సందర్శకులకు పాములను ఇచ్చి, వాటిపై ఉన్న భయాన్ని తొలగించారు. తిరుపతి పరిసరాల్లో పాములు కనిపిస్తే తమకు సమాచారం ఇస్తున్నారని జూ క్యూరేటర్‌ హిమశైలజ తెలిపారు. తమ వద్ద పాములను పట్టగలిగే సిబ్బంది ఒకరే ఉండటంతో మిగతా వారికీ అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. 

Updated Date - 2021-01-13T05:34:22+05:30 IST