మాయమైన ఆభరణాలకు సొమ్ము చెల్లింపు

ABN , First Publish Date - 2021-12-30T05:45:51+05:30 IST

గుర్రంకొండ యూనియన్‌ బ్యాంకులో మాయమైన తాకట్ట బంగారానికి బదులు బ్యాంకు అధికారులు ఎట్టకేలకు సొమ్ము చెల్లించారు.

మాయమైన ఆభరణాలకు సొమ్ము చెల్లింపు
గుర్రంకొండ యూనియన్‌ బ్యాంకు

గుర్రంకొండ, డిసెంబరు 29: గుర్రంకొండ యూనియన్‌ బ్యాంకులో మాయమైన తాకట్ట బంగారానికి బదులు బ్యాంకు అధికారులు ఎట్టకేలకు సొమ్ము చెల్లించారు. గ్రాము బంగారం విలువ రూ.4,600 లెక్కన 123 గ్రాములకు నగదు చెల్లించారు. దీంతో బాధితులైన మల్లికార్జునరెడ్డి, సుధారాణిలు శాంతించారు. బ్యాంకులో అక్రమాలకు పాల్పడిన సిబ్బందిని బ్యాంకు ఉన్నతాధికారులు మందలించారు. తాకట్టుపెట్టిన ఆభరణాలలో కొన్ని మాయం కావడంతో ఖాతాదారులు రెండు రోజుల క్రితం బ్యాంకు వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-12-30T05:45:51+05:30 IST