చంద్రబాబుపై కేసు నమోదు సరికాదు: టీడీపీ

ABN , First Publish Date - 2021-05-08T07:07:56+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేయడం సరికాదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, బీఎన్‌ రాజసింహులు శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించారు.

చంద్రబాబుపై కేసు నమోదు సరికాదు: టీడీపీ


చిత్తూరు (సెంట్రల్‌), మే 7: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేయడం సరికాదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, బీఎన్‌ రాజసింహులు శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించారు. సుబ్బయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కర్నూలు పోలీస్‌స్టేషన్‌లో చంద్రబాబుపై కేసు నమోదు చేయడం బాధాకరమన్నారు. కొత్త వైరస్‌ గురించి వార్తా పత్రికలు, ఛానల్స్‌లో విస్తృత ప్రచారం జరుగుతోందన్నారు. వైరస్‌ను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోకుండా చంద్రబాబుపై కేసు పెట్టుడం దారుణమని వారు పేర్కొన్నారు.

Updated Date - 2021-05-08T07:07:56+05:30 IST