చేపల చెరువు వేలం పాట ఘర్షణలో 16 మందిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-12-26T04:48:10+05:30 IST

మండలంలోని గర్నిమిట్ట గ్రామంలో చేపలచెరువు వేలం పాట నిర్వహణలో శుక్రవారం టీడీపీ -వైసీపీ నాయకుల మధ్య వివాదం తలెత్తి తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.

చేపల చెరువు వేలం పాట ఘర్షణలో 16 మందిపై కేసు నమోదు

కేవీపల్లె, డిసెంబరు 25: మండలంలోని గర్నిమిట్ట గ్రామంలో చేపలచెరువు వేలం పాట నిర్వహణలో శుక్రవారం టీడీపీ -వైసీపీ నాయకుల మధ్య వివాదం తలెత్తి తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఇరువర్గాలు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసు కున్నారు. అధికార వైసీపీకి చెందిన ఎనిమిది మందిపైనా, అలాగే టీడీపీకి చెందిన మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాలక్రిష్ణ తెలిపారు. కేసు నమోదైన వారిలో వైసీపీ వర్గీయులు గజ్జెల శీన్‌రెడ్డి, నాగరాజ, శంకర, కిశోర్‌, తారక, హరిబాబు, శ్రీనివాసులు, రమేష్‌, టీడీపీ వర్గీయులు ధనుంజయ, సాయి, చరణ్‌, ప్రసాద్‌, లోకేష్‌, దినేష్‌, రాజశేఖర్‌నాయుడు, వెంకట్రమణ నాయుడు ఉన్నారు. ఘర్షణకు కారణమైన వారందరినీ అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపచనున్నట్లు వివరించారు.

Updated Date - 2021-12-26T04:48:10+05:30 IST