మరో 46 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-01-20T05:30:00+05:30 IST

జిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల వ్యవధిలో కొత్తగా 46 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించింది.

మరో 46 మందికి కరోనా

తిరుపతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల వ్యవధిలో కొత్తగా 46 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించింది. తిరుపతి నగరం, తిరుపతి రూరల్‌ మండలాల్లో 11 చొప్పున, చిత్తూరులో 8, బైరెడ్డిపల్లె, కలికిరి మండలాల్లో 4 వంతున, పీలేరు, తవణంపల్లె మండలాల్లో 2 చొప్పున, ములకలచెరువు, పలమనేరు, సదుం, తొట్టంబేడు మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 89562కు చేరింది. బుధవారం ఉదయానికి యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు 143 ఉన్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. 


Updated Date - 2021-01-20T05:30:00+05:30 IST