నీళ్లలో ఇల్లు కట్టుకోలేం... మరో చోట ఇవ్వండి!

ABN , First Publish Date - 2021-12-28T06:05:16+05:30 IST

జగనన్నకాలనీలో తమకు కేటాయించిన స్థలం ఇళ్లు నిర్మించుకోవ డానికి అనుకూలంగా లేదని అమ్మచెరువుమిట్ట లబ్ధిదారులు మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.

నీళ్లలో ఇల్లు కట్టుకోలేం... మరో చోట ఇవ్వండి!
కమిషనర్‌ రఘునాథరెడ్డికి వినతిపత్రం ఇస్తున్న జగనన్నకాలనీ లబ్ధిదారులు

మదనపల్లె, డిసెంబరు 27: జగనన్నకాలనీలో తమకు కేటాయించిన స్థలం ఇళ్లు నిర్మించుకోవ డానికి అనుకూలంగా లేదని అమ్మచెరువుమిట్ట లబ్ధిదారులు మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందనలో వారంతా వినతి పత్రం అందజేశారు. అమ్మచెరువుమిట్ట ప్రాంతా నికి చెందిన తాము మగ్గాలు నేస్తున్నామని, తమ కు జగనన్న కాలనీలో ఇంటి మంజూరు చేసినట్లు చెప్పారు. తమకు మండలంలోని పోతబోలు వద్ద స్థలం చూపించారని, అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనువుగా లేదని చెప్పారు. ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోయిందని చెప్పారు. తమకు మరో చోట స్థలం చూపిస్తే, ఇళ్లు నిర్మించుకుంటా మని   కమిషనర్‌ను కోరగా, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఉదయం 10.30గంటల నుంచి 11.30గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు సామాజిక సమస్యలు, వ్యక్తిగత అంశాలపై కమిషనర్‌కు వినతలు, ఫిర్యాదులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈ మహేష్‌, ఆర్‌వో పల్లవి, టీపీవో జాకీరా, ఏఈ కిరణ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-12-28T06:05:16+05:30 IST