ప్లాస్టిక్‌ వ్యర్థ పదార్థాల గోడౌన్‌ దగ్ధం

ABN , First Publish Date - 2021-11-23T05:30:00+05:30 IST

పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. లక్ష్మీనగర్‌ కాలనీలో జనావాసాల మధ్య వున్న వ్యర్థ ప్లాస్టిక్‌ వస్తువుల గోడౌన్‌లో సుమారు 3.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.

ప్లాస్టిక్‌ వ్యర్థ పదార్థాల గోడౌన్‌ దగ్ధం

పలమనేరు, నవంబరు 23 : పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. లక్ష్మీనగర్‌ కాలనీలో జనావాసాల మధ్య వున్న వ్యర్థ ప్లాస్టిక్‌ వస్తువుల గోడౌన్‌లో సుమారు 3.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల నివాసమున్న ప్రజలు గాఢనిద్రలో వున్న సమయంలో ఒక్కసారిగా గోడౌన్‌ పైకప్పునకు వేసిఉన్న సిమెంటురేకులు పెద్దశబ్దంతో పేలిపోవడంతోపాటు ఆప్రాంతమంతా పొగ దట్టంగా అలుముకుంది. దీంతో ఒక్కసారిగా నిద్రలేచిన ప్రజలు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగసి పడుతున్న మంటలు పక్కకు వ్యాపించకుండా ఆర్పివేశారు. అగ్నిప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని భావిస్తున్నారు. జనావాసాల మధ్య దుర్గంధాన్ని వెదజల్లుతున్న  ప్లాస్టిక్‌ వ్యర్థపదార్థాల గోడౌన్‌ను తొలగించాలని పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. ఇకనైనా ఈ ప్లాస్టిక్‌ గోడౌన్‌ను తరలించాలని కోరారు. కాగా ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 2లక్షల మేర ఆస్తి నష్టం జరిగి వుంటుందని అంచానా వేస్తున్నారు.

Updated Date - 2021-11-23T05:30:00+05:30 IST