దిశ యాప్‌పై చైతన్యం తీసుకురండి: నవాజ్‌బాషా
ABN , First Publish Date - 2021-07-25T06:19:03+05:30 IST
దిశ యాప్‌పై చైతన్యం తీసుకురండి: నవాజ్‌బాషా
మదనపల్లె క్రైం, జూలై 24: ఆపదలో వున్న మహిళను కాపాడేందుకు దిశ యాప్ రక్షణ కవచంలా పనిచేస్తుందని ఎమ్మెల్యే నవాజ్‌బాషా అన్నారు. డీఎస్పీ రవిమనోహరాచారి ఆధ్వర్యంలో మదనపల్లె పట్టణంలోని శేషసాయి కల్యాణమండపంలో దిశ యాప్‌పై జరిగిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహిళల సెల్ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయించాల్సిన బాధ్యత మహిళా పోలీసులపై ఉందన్నారు. యాప్ డౌన్‌లోడ్‌తో ఆపదలో వున్న మహిళను సులభంగా రక్షించవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎస్పీ రవిమనోహరాచారి మాట్లాడుతూ... సబ్‌డివిజన్ పరిధిలో ఇప్పటికే సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించినట్లు చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ మనూజ, వైసీపీ నాయకుడు ఉదయ్‌కుమార్, 6వవార్డు కౌన్సిలర్ కె.ప్రసాద్‌బాబు, సీఐలు ఈదురుబాషా, నరసింహులు, శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, ఎస్ఐలు లోకేష్, చంద్రమోహన్, సోమశేఖర్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.