శాకాంబరీదేవిగా బోయకొండ గంగమ్మ

ABN , First Publish Date - 2021-10-10T07:07:49+05:30 IST

దసరా మహోత్సవాల్లో భాగంగా బోయకొండ గంగమ్మ శనివారం శాకాంబరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.

శాకాంబరీదేవిగా బోయకొండ గంగమ్మ

చౌడేపల్లె, ఆక్టోబరు 8: దసరా మహోత్సవాల్లో భాగంగా బోయకొండ గంగమ్మ శనివారం శాకాంబరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.అర్చకులు మూల విరాట్టుకు పంచామృతాభిషేకాలు నిర్వహించి శాకాంబరీ దేవిగా కొలువుదీర్చారు. స్వర్ణాభరణాలతో అలంకరించారు.మూలస్థానం వద్ద అమ్మవారిని కూరగాయలతో శాకాంబరీదేవిగా అలం కరించారు. అద్దాల మండపం వద్ద ప్రత్యేకంగా  ఉత్సవ మూర్తిని అలంకరించి, కలశ స్థాపన చేసి ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.ఉభయదారులచే అమ్మవారి మూల మంత్రాన్ని పఠింపజేస్తూ శాకాంబదీదేవి విశిష్టతను వివరించారు. ఉభయదారులకు అమ్మవారి శేష వస్త్రాలను, తీర్థప్రసాదాలను ఆలయ చైర్మన్‌ శంకరనారాయణ, ఈవో చంద్రమౌళి అందజేశారు. ఉభయదారులుగా కలికిరికి చెందిన లక్ష్మి, శ్రీనివాసులు, బెంగళూరుకు చెందిన వెంకటమ్మ, చిక్కముని శెట్టి, చౌడేపల్లెకు చెందిన పద్మ, రెడ్డిప్రకాష్‌, పుంగనూరుకు చెందిన తనూజ, ప్రదీప్‌ కుమార్‌రెడ్డి, ఉష, మున్సిపల్‌ కమిషనర్‌ వర్మ వ్యవహరించారు.తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-10T07:07:49+05:30 IST