మహిషాసుర మర్ధినిగా బోయకొండ గంగమ్మ

ABN , First Publish Date - 2021-10-15T05:07:29+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆలయంలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో భాగంగా గంగమ్మ గురువారం మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిచ్చారు.

మహిషాసుర మర్ధినిగా బోయకొండ గంగమ్మ
మహిషాసుర మర్ధినిగా బోయకొండ గంగమ్మ

చౌడేపల్లె, ఆక్టోబరు 14: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆలయంలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో భాగంగా గంగమ్మ గురువారం మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిచ్చారు. రెండు చేతుల్లో శంఖుచక్రాలు, మరో రెండు చేతుల్లో విల్లంబులు, ఇంకో చేతిలో ఖడ్గం, మరో చేతిలో డాలు, మరో చేతిలో గద, ఇంకో చేతిలో త్రిశూలంతో అష్ట భుజధారిగా అలంకరించిన అర్చకులు స్వర్ణాభరణాలతో మహిషాసురమర్ధినిగా సింహ వాహనంపై అమ్మ వారిని కొలువుదీర్చారు.ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అద్దాల మండపం వద్ద ప్రత్యేకంగా అమ్మవారి ఉత్సవ మూర్తిని అలంకరించి, కలశ స్థాపన చేశారు. ఉభయదారులుగా నెల్లూరు డీపీవో ధనలక్షి ్మ, శివప్రసాద్‌, మాదంవారిపల్లెకు చెందిన రత్నమ్మ, వెంకటనారాయణ, బెంగళూరుకు చెందిన శకుంతలమ్మ, కృష్ణప్ప, రత్నమ్మ, సుబ్బయ్య, సరోజ, శ్రీధర్‌, తిరుపతికి చెందిన యామిని, రాజానరేన్‌ వ్యవహరించారు.వారికి అమ్మవారి శేషవస్త్రాలను, తీర్థప్రసాదాలను ఆలయ చైర్మన్‌ శంకరనారాయణ, ఈవో చంద్రమౌళి అందజేశారు. 

Updated Date - 2021-10-15T05:07:29+05:30 IST