విద్యుత్‌ షాక్‌తో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-07-08T06:34:35+05:30 IST

గాలివానతో స్టేవయిర్‌కు విద్యుత్‌ సరఫరా అయి దానికి తగిలి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సంఘటన బుధవారం రాత్రి అడవికొత్తూరు గ్రామంలో జరిగింది.

విద్యుత్‌ షాక్‌తో ఇద్దరి మృతి
మృతి చెందిన దళిత యువకులు

దళిత కుటుంబాల్లో నెలకొన్న విషాదం


పుత్తూరు,  జూలై 7: గాలివానతో స్టేవయిర్‌కు విద్యుత్‌ సరఫరా అయి దానికి తగిలి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సంఘటన బుధవారం రాత్రి అడవికొత్తూరు గ్రామంలో జరిగింది. నగరి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మద్దయ్యాచారి తెలిపిన వివరాల మేరకు... నగరి మండలం అడవి కొత్తూరు గ్రామంలో ఒకరు చనిపోతే దివసానికి నగరి సత్రవాడకు చెందిన బంధువులు హాజరయ్యారు. భోజనం చేసిన తరువాత  బుధవారం సాయంత్రం తిరిగి బయలు దేరుదామనుకున్న సమయంలో గాలివాన వచ్చింది. దీంతో ఇద్దరు యువకులు తడవకుండా ఉండేందుకు ఓ  షెడ్డులోకి వెళ్ళారు. ఈ సమయంలో గాలివానకు షెడ్డు పక్కనే ఉన్న స్టేవయిర్‌కు కరెంటు సరఫరా అయింది.  వర్షం వెలసిన తరువాత బయటకు సుధాకర్‌ (25), దళపతి (26)  బయటకు వచ్చారు. అనుకోకుండా ఆ తీగెలకు టచ్‌ అయ్యారు. దీంతో షాక్‌ గురయ్యారు. ఇది గమనించిన వారి బంధువులు కట్టెలతో వారిని విడిపించి హుటాహుటిన  నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు దీంతో అడవికొత్తూరు, నగరి సత్రవాడ దళితవాడ లో విషాదం నెలకుంది. చనిపోయిన ఇద్దరు యువకులు కూలీ పని చేసుకుని జీవించే వారు. దీంతో వారి కుటుంబాలు దుఖ:సాగరంలో  మునిగి పోయాయి.

 

Updated Date - 2021-07-08T06:34:35+05:30 IST