ప్రాణాపాయంలో ఉన్న వారి కోసమే రక్తదానం

ABN , First Publish Date - 2021-08-28T05:04:07+05:30 IST

ప్రాణాపాయంలో ఉన్న వారి ప్రాణాలు కాపాడటం కోసమే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు రోటరీక్లబ్‌ ప్రతి నిధులు డాక్టర్‌ శరణ్‌కుమార్‌, పూల త్యాగరాజులు తెలిపారు.

ప్రాణాపాయంలో ఉన్న వారి కోసమే రక్తదానం
రక్తదానం చేస్తున్న రోటరీ క్లబ్‌ సభ్యులు

పుంగనూరు రూరల్‌, ఆగస్టు 27: ప్రాణాపాయంలో ఉన్న వారి ప్రాణాలు కాపాడటం కోసమే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు రోటరీక్లబ్‌ ప్రతి నిధులు డాక్టర్‌ శరణ్‌కుమార్‌, పూల త్యాగరాజులు తెలిపారు. శుక్రవారం స్థానిక బీఎంఎస్‌ క్లబ్‌ ఆవరణలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 40 యూ నిట్లు సేకరించినట్లు వారు తెలిపారు. యువత రక్తదానం చేసి ప్రాణదానానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్పన్‌ లలిత, రోటరీ క్లబ్‌ ప్రతినిధులు మధుసూదన్‌, నానబాల గణేశ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-28T05:04:07+05:30 IST