జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2021-09-03T07:18:37+05:30 IST

జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలని రైతులకు రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌ డాక్టర్‌ బీఎంకే రెడ్డి సూచించారు.

జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి
రైతులకు సూచనలిస్తున్న వెంకటేశ్వర్లు

తవణంపల్లె, సెప్టెంబరు 2: పుంగనూరు జాతి ఆవులను, నాటు కోళ్లను పరిరక్షించుకుని జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలని రైతులకు రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌ డాక్టర్‌ బీఎంకే రెడ్డి సూచించారు. గురువారం తవణంపల్లె మండలంలోని అరగొండ అపోలో సంపూర్ణ ఆరోగ్య కేంద్రంలో పుంగనూరు ఆవులు, నాటు కోళ్ల పెంపకంపై రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశు పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధకశాఖ జేడీ వెంకటేశ్వర్లు, డీడీలు ప్రభాకర్‌, అషిప్‌, ఏడీ పద్మావతి, పశువైద్యాధికారి పల్లవి పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-03T07:18:37+05:30 IST