ఎమ్మెల్సీగా భరత్ ప్రమాణ స్వీకారం
ABN , First Publish Date - 2021-12-09T06:14:30+05:30 IST
ఇటీవల శాసనమండలికి ఎన్నికైన శాకుప్పం వైసీసీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కృష్ణ రాఘన జయేంద్ర భరత్ బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.

కుప్పం, డిసెంబరు 8: ఇటీవల శాసనమండలికి ఎన్నికైన శాకుప్పం వైసీసీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కృష్ణ రాఘన జయేంద్ర భరత్ బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు బుధవారం భరత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం భరత్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కార్యాలయంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.