ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఫొటో ఎగ్జిబిషన్‌

ABN , First Publish Date - 2021-03-21T07:18:03+05:30 IST

తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో ఆదివారం నుంచి ఆజాదీ కా అమృత్‌ మహాత్సవ్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ను మూడ్రోజులపాటు నిర్వహిస్తున్నారు.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఫొటో ఎగ్జిబిషన్‌

నేటి నుంచి మూడ్రోజులపాటు శిల్పారామంలో నిర్వహణ


తిరుచానూరు, మార్చి 20: తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో ఆదివారం నుంచి ఆజాదీ కా అమృత్‌ మహాత్సవ్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ను మూడ్రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, రాయలసీమ జిల్లాల ఏడీ శివహరినాయక్‌ శనివారం తెలిపారు. స్వాతంత్య్రం సిద్ధించి 2022 నాటికి 75 ఏళ్లు కానుండటంతో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఈనెల 12నుంచి ప్రారంభించిందని చెప్పారు. 75 వారాల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోనూ ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర తెలిపే ఫొటో ఎగ్జిబిషన్‌ను నగరవాసులు తిలకించాలని కోరారు. ఎగ్జిబిషన్‌ను ఎస్వీయూ వీసీ రాజారెడ్డి ఉదయం 11గంటలకు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-21T07:18:03+05:30 IST