సెబ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌గా అయేషా

ABN , First Publish Date - 2021-08-10T05:55:37+05:30 IST

చిత్తూరు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) విభాగానికి అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌గా షేక్‌ అయేషా బేగం నియమితులయ్యారు.

సెబ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌గా అయేషా
మధుమోహన్‌రావుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న అయేషా

చిత్తూరు సిటీ, ఆగస్టు 9: చిత్తూరు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) విభాగానికి అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌గా షేక్‌ అయేషా బేగం నియమితులయ్యారు. 2018 బ్యాచ్‌కు చెందిన ఈమె తిరుపతి పోలీసు ట్రైనింగ్‌ కాలేజీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సోమవారం చిత్తూరులో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ కమిషనర్‌ మధుమోహన్‌ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. 

Updated Date - 2021-08-10T05:55:37+05:30 IST