బి.కొత్తకోట ఎస్‌ఐకి అవార్డు

ABN , First Publish Date - 2021-12-25T05:49:46+05:30 IST

నేర పరిశోధన, నేరస్తులను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపినందుకు 2021 సంవత్సరానికి గానూ బి.కొత్తకోట ఎస్‌ఐ రామ్మోహన్‌ ఉత్తమ ఎస్‌ఐ అవార్డు అందుకున్నారు.

బి.కొత్తకోట ఎస్‌ఐకి అవార్డు
ఎస్పీ సెంఽథిల్‌కుమార్‌ నుంచి అవార్డు అందుకుంటున్న ఎస్‌ఐ రామమోహన్‌

బి.కొత్తకోట, డిసెంబరు 24: నేర పరిశోధన, నేరస్తులను అరెస్టు చేయడంలో  ప్రతిభ చూపినందుకు 2021 సంవత్సరానికి గానూ బి.కొత్తకోట ఎస్‌ఐ రామ్మోహన్‌ ఉత్తమ ఎస్‌ఐ అవార్డు అందుకున్నారు. శుక్రవారం చిత్తూరులో నిర్వహించిన క్రైం మీటింగ్‌లో ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ఈ అవార్డును ఎస్‌ఐకి అందజేశారు.  కర్ణాటక మద్యం,  సారా అక్రమ రవాణాపై ఉక్కుపాదం, నేరస్తులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచినందుకు గానూ ఎస్‌ఐకి ఉత్తమ అవార్డు లభించింది. అదేవిధంగా కేసుల నమోదు, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ ఇతర అంశాలపై అవార్డు వచ్చినట్లు పోలీసులు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ అవార్డు రాకతో  బాధ్యత మరింత పెరిగిందన్నారు. నేరాల నియంత్రణే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-25T05:49:46+05:30 IST