మైనార్టీలపై దాడులు తగవు
ABN , First Publish Date - 2021-12-26T05:36:04+05:30 IST
మైనార్టీలపై దాడులు తగవని పట్టణ టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు పేర్కొన్నారు.

శ్రీకాళహస్తి, డిసెంబరు 25: మైనార్టీలపై దాడులు తగవని పట్టణ టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం వారు మాట్లాడుతూ... అవినీతి అధికారులను శిక్షించండన్న నినాదంతో నంద్యాలలో మౌలానా ముస్తాక్ అహ్మద్ తలపెట్టిన దీక్షలకు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల కక్షసాధింపు చర్యలు పెరిగాయనీ, మదర్సాలపై దాడులు సబబుకాదని గుర్తుచేశారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కర్నూలు జిల్లాలో వక్ఫ్‌బోర్డు ఆస్తులను రక్షించలేని డీఎండబ్ల్యూవో ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు షాకీరాలీ, షఫి, జిలానీ, బషీర్, ఖాదర్‌బాషా, అస్మత్, ఖాదర్, కరీం, మీర్జా, లాల్‌బాషా, మస్తాన్ పాల్గొన్నారు.