బాల్యవివాహాల అడ్డుకట్టకు సహకరించాలి

ABN , First Publish Date - 2021-11-02T06:26:40+05:30 IST

బాల్యవివాహాల అడ్డుకట్టకు ప్రజలు సహకరించాలని సీఐ శ్రీహరి కోరారు.

బాల్యవివాహాల అడ్డుకట్టకు సహకరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీఐ శ్రీహరి

 ఏర్పేడు, నవంబరు 1: బాల్యవివాహాల అడ్డుకట్టకు ప్రజలు సహకరించాలని సీఐ శ్రీహరి కోరారు. మండలంలోని పాపానాయుడుపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సోమవారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చిన్న వయసులో వివాహాలు నేరమనీ, పుట్టే బిడ్డలు బలహీనంగా ఉంటారని గుర్తుచేశారు. దిశ యాప్‌ మహిళలకు ఓ వరమని పేర్కొ న్నారు. ప్రధానంగా మహిళలపై దాడులను అరికట్టడమే దిశ యాప్‌ లక్ష్యమని అన్నారు. ఏవైనా సమస్యలొస్తే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌రెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-02T06:26:40+05:30 IST