రసరమ్యం... అష్టావధానం

ABN , First Publish Date - 2021-11-08T06:06:17+05:30 IST

ముక్కంటి కార్తీకమాస మహోత్సవాల్లో భాగంగా జరిగిన అష్టావధానం ఆద్యంతం రసరమ్యంగా సాగింది.

రసరమ్యం... అష్టావధానం
కార్యక్రమంలో పాల్గొన్న నాగఫణిశర్మ, ప్రముఖులు

శ్రీకాళహస్తి, నవంబరు 7: ముక్కంటి కార్తీకమాస మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆలయ బ్రహ్మగుడి ఆవరణలో జరిగిన అష్టావధానం ఆద్యంతం రసరమ్యంగా సాగింది. ప్రముఖ ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమ ముఖ్య అతిథిగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌ హాజరయ్యారు. అప్రస్తుత ప్రసంగం, ఆసువులు, సమస్యాపూరణం తదితర అంశాలతో సాగిన అష్టావధాన కార్యక్రమం సాహితీప్రియులను మంత్రముగ్ధులను చేసింది. కార్యక్రమంలో ప్రముఖులు రంగి సత్యనారాయణ, కుందుర్తి నాగపల్లవి, మహికిరణ్‌శర్మ, రాణి సదాశివమూర్తి, రంగాచార్యులు, కల్లూరి కిషన్‌, కల్లూరి సూర్యనారాయణమూర్తి, లక్ష్మీనారాయణ, దత్తాత్రేయశర్మ, శాస్త్రి, వీరాస్వామి, సినీగేయ రచయిత అనంతశ్రీరామ్‌, ఆలయ ఈవో పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-08T06:06:17+05:30 IST