12 సింగిల్‌విండోలకు పర్సన్‌ ఇన్‌చార్జిల నియామకం

ABN , First Publish Date - 2021-12-08T07:19:53+05:30 IST

12 సింగిల్‌విండోలకు పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

12 సింగిల్‌విండోలకు పర్సన్‌ ఇన్‌చార్జిల నియామకం

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 7: పదవీకాలం పూర్తయిన 12 వ్యవసాయ ప్రాథమిక పరపతి సహకార సంఘాల(సింగిల్‌విండోల)కు పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిలుగా అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌లు, సబ్‌డివిజన్‌ కో-ఆపరేటివ్‌ ఆఫీసర్లు బాధ్యతలు స్వీకరించారు. మొలకలచెరువు మండలం సోంపల్లె, విజయపురం మండలం అగరం రామకృష్ణ, తవణంపల్లె మండలం అరగొండ, కొండ్రాజుకాలువ, దిగువమాఘం, పలమనేరు మండలం బయ్యప్పగారిపల్లెతోపాటు చిన్నగొట్టిగల్లు, పుంగనూరు, బైరెడ్డిపల్లె, సదుం, నిండ్ర, పెనుమూరు సింగిల్‌ విండోలకు అధికారుల పాలన ప్రారంభమైంది.

Updated Date - 2021-12-08T07:19:53+05:30 IST