వైఎస్సార్‌ చేయూత దరఖాస్తుదారులు ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-05-31T04:47:06+05:30 IST

వైఎస్సార్‌ చేయూత పథకానికి ఈ ఏడాది కొత్తగా దరఖాస్తు చేసుకునే మహిళలు ఆధార్‌కార్డు, ఫోన్‌ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని జేసీ రాజశేఖర్‌ సూచించారు.

వైఎస్సార్‌ చేయూత దరఖాస్తుదారులు   ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలి

చిత్తూరు కలెక్టరేట్‌, మే 30: వైఎస్సార్‌ చేయూత పథకానికి ఈ ఏడాది కొత్తగా దరఖాస్తు చేసుకునే మహిళలు ఆధార్‌కార్డు, ఫోన్‌ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని జేసీ రాజశేఖర్‌ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింద గతంలో లబ్ధిపొందిన వారు మళ్లీ ఆధార్‌ లింక్‌ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. 60 ఏళ్లు పూర్తయిన వారికి ఈ పథకం వర్తించదని, వారి పేర్లు తొలగిస్తామని పేర్కొన్నారు. ఆధార్‌ కార్డుల్లో చిరునామా, ఫోన్‌ నెంబర్లు మారినా, తప్పులున్నా సరిదిద్దుకోవచ్చని జేసీ చెప్పారు. 

Updated Date - 2021-05-31T04:47:06+05:30 IST