మందోత్సాహం

ABN , First Publish Date - 2021-05-30T06:56:54+05:30 IST

తమిళనాడు సరిహద్దు ప్రాంతాలైన బలిజకండ్రిగ, గంగమాంబపురం మద్యం ప్రియులతో కిటకిటలాడుతున్నాయి.

మందోత్సాహం
బలిజకండ్రిగ మద్యం దుకాణం వద్ద జనం

 పాలసముద్రం: తమిళనాడు సరిహద్దు ప్రాంతాలైన బలిజకండ్రిగ, గంగమాంబపురం మద్యం ప్రియులతో కిటకిటలాడుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకే మూసేయాల్సి ఉన్నా మందుబాబులను నిరాశ పరచలేక ఇంకో గంటా గంటన్నరపాటు అమ్మకాలు సాగిస్తూ తమిళమందుబాబుల సేవలో ఈ రెండు గ్రామాల్లోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మద్యం దుకాణాలు మునిగితేలుతున్నాయి. దీంతో బలిజకండ్రిగ దుకాణంలో రోజుకు రూ. 10లక్షలు, గంగమాంబపురంలో రూ.5 లక్షలకు తగ్గకుండా వ్యాపారం జరుగుతోంది. మాస్కులున్నా లేకపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా వీరిని వారించకుండా అమ్మకాలు పెంచుకుంటున్నారు. 

Updated Date - 2021-05-30T06:56:54+05:30 IST