మాస్క్‌ లేకుంటే జరిమానా

ABN , First Publish Date - 2021-03-21T07:01:42+05:30 IST

జిల్లాలో శుక్ర, శనివారాల నడుమ 24 గంటల వ్యవధిలో మరో 60 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది.

మాస్క్‌ లేకుంటే జరిమానా

తిరుపతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్ర, శనివారాల నడుమ 24 గంటల వ్యవధిలో మరో 60 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. ఈ కేసులతో ఇప్పటి వరకూ జిల్లాలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 91136కు చేరుకున్నాయి. కాగా జిల్లాలో శనివారం ఉదయం 9 గంటల సమయానికి యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు 491 వున్నట్టు యంత్రాంగం ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా చిత్తూరులో ఆదివారం నుంచి  మాస్క్‌ ధరించకుండా బయట తిరిగేవారికి   జరిమానా విధిస్తామని కమిషనర్‌ విశ్వనాథ్‌ తెలిపారు.ఇదే తరహాలోనే  పుత్తూరు పట్టణంలోనూ మాస్క్‌ లేకుండా బయటకొచ్చేవారికి ఆదివారం నుంచి జరిమానా విధిస్తామని కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. నగరిలో జరిగిన మండల కొవిడ్‌ కోర్‌ కమిటీ సమావేశంలో మాస్కులు లేనివారిని ఆటోలో ఎక్కించుకోకూడదని నిర్ణయించారు. ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలుంటే వారి వివరాలను మున్సిపల్‌ అధికారులకు తెలియజేయాలని సూచించారు. 

Updated Date - 2021-03-21T07:01:42+05:30 IST