తిరుపతిలో మరో ఒమైక్రాన్ కేసు
ABN , First Publish Date - 2021-12-30T07:31:14+05:30 IST
హథీరాంజీనగర్‌కు చెందిన యువకుడు ఒమైక్రాన్ బారినపడ్డాడు.

తిరుపతి సిటీ, డిసెంబరు 29: తిరుపతిలో మరో ఒమైక్రాన్ కేసు నమోదయింది. హథీరాంజీనగర్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు ఈ నెల 21న అమెరికా నుంచి చెన్నై మీదుగా తిరుపతికి వచ్చా డు. ఈ క్రమంలో ఆ యువకుడికి చేసిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో విష్ణునివాసం కొవిడ్ కేంద్రానికి తరలించారు. ఒమైక్రాన్ పరీక్ష నిమిత్తం నమూనాలను సేకరించి జీనమ్ సీక్వెన్సీని హైదరాబాద్ సీసీఎంబీకి పంపారు. అక్కడి పరీక్షల్లో యువకుడికి ఒమైక్రాన్ వేరియంట్‌గా నిర్థారణ అయ్యింది.దీంతో అతడి ప్రైమరీ కాంటాక్టుల వివరాలను తెలుసుకుని వా రికి పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు సమాయత్తమయ్యారు.