కుటుంబ కలహాలతో అంగనవాడీ కార్యకర్త ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-31T07:01:02+05:30 IST

కుటుంబ కలహాలతో అంగనవాడీ కార్యకర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన బుచ్చినాయుడు కండ్రిగ మండలం వీఎ్‌సపురం పంచాయతీ వేణుగోపాలపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున జరిగింది.

కుటుంబ కలహాలతో  అంగనవాడీ కార్యకర్త ఆత్మహత్య
వాణి (ఫైల్‌ఫొటో)

బుచ్చినాయుడుకండ్రిగ, డిసెంబరు 30:  కుటుంబ కలహాలతో  అంగనవాడీ కార్యకర్త ఉరి వేసుకుని  ఆత్మహత్య  చేసుకుంది. సంఘటన బుచ్చినాయుడు కండ్రిగ మండలం వీఎ్‌సపురం పంచాయతీ వేణుగోపాలపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున జరిగింది.  పోలీసుల కథనం మేరకు.... వేణుగోపాలపురానికి చెందిన  వాణి (38) పద్మావతిపురం గ్రామంలో మినీ అంగనవాడీ కార్యకర్తగా పని చేస్తున్నారు. భర్త చిట్లిబోయిన ప్రసాద్‌ శ్రీసిటీలోని  ఓ కంపెనీలో బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. భార్య,భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గతంలో కూడా మనస్పర్థలతో రెండు పర్యాయాలు ఆత్మహత్యాయత్నం చేసిందని గ్రామస్థులు అంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి భార్య భర్తలు భోజనం చేసుకుని నిద్రపోయారు. రెండు గంటల తరువాత భార్య పడకలో లేకపోవడంతో భర్త బయటకు వచ్చి చూడగా రేకుల షెడ్డులో ఉరివేసుకుని ఉండటం గమనించి ఇంటి ప్రక్కన వారిని పిలిచి బయటకు తీశారు. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జగన్నాథరెడ్డి తెలిపారు. శవాన్ని పంచనామా కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ చెప్పారు. 

Updated Date - 2021-12-31T07:01:02+05:30 IST