అరుణానది కాలువలో వృద్ధురాలి మృతదేహం

ABN , First Publish Date - 2021-02-01T06:59:59+05:30 IST

మతిస్ధిమితం లేక నాగలాపురం మండలం సురుటుపల్లె వద్ద ఉన్న అరుణానది కాలువలో పడి ఓ వృద్ధురాలు చనిపోయింది

అరుణానది కాలువలో వృద్ధురాలి మృతదేహం
మస్తానమ్మ(ఫైల్‌ ఫొటో)

నాగలాపురం, జనవరి 31: మండలంలోని సురుటుపల్లె వద్ద ఉన్న అరుణానది కాలువలో ఆదివారం ఓ వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుటుంబసభ్యుల కథనం మేరకు.. పిచ్చాటూరు మండలం హనుమంతాపురం ఏఏడబ్ల్యుకి చెందిన మస్తానమ్మ(65)కు మతిస్థిమితం లేదు. దీంతో తరచూ ఇంటి నుంచి బయటిప్రాంతాలకు వెళ్లడం బంధువులు గాలించి ఇంటికి తీసుకురావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మూడువారాల కిందట వృద్ధురాలు అదృశ్యమవడంతో, కుటుంబీకులు ఎస్‌ఐ దస్తగిరికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నాగలాపురం మండలం సురుటుపల్లె సమీపంలోని అరుణానది కాలువలో ఆదివారం మస్తానమ్మ మృతదేహం బయటపడింది. ఘటనా స్థలంలో వైద్యులు పోస్టుమార్టం జరిపి కుటుంబీకులకు వృద్ధురాలి శవాన్ని అప్పగించారు. 

Updated Date - 2021-02-01T06:59:59+05:30 IST