సందడిగా అమావాస్య ఉత్సవం
ABN , First Publish Date - 2021-04-12T06:48:09+05:30 IST
శ్రీకాళహస్తిలో ఆదివారం రాత్రి వైభవంగా అమావాస్య ఉత్సవం జరిగింది.
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11: శ్రీకాళహస్తిలో ఆదివారం రాత్రి వైభవంగా అమావాస్య ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని ముక్కంటి ఆలయ అలంకారమండపంలో కొలువుదీర్చారు. అనంతరం ఉత్సవమూర్తులను అంబారీలపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. చతుర్మాడవీధుల్లో ఊరేగుతున్న స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణారెడ్డి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.