వైసీపీ ఆగడాలను వడ్డీతో తిరిగి చెల్లిస్తాం : మాజీ మంత్రి అమర్
ABN , First Publish Date - 2021-10-29T05:07:10+05:30 IST
రాష్ట్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అధికార పక్షం జరుపుతున్న ఆగడాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు.

వి.కోట, అక్టోబరు 28: రాష్ట్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అధికార పక్షం జరుపుతున్న ఆగడాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. గురువారం వి.కోట పీఎంఆర్ కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. ఇటీవల తాడేపల్లెలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి అయితే అధికారులు మాత్రం ఎవరికీ కొమ్ముకాయరాదన్నారు. డీజీపీ సీఎం చేతిలో కీలుబొమ్మలా మారి వారు చెప్పిందల్లా చేయడం సరికాదని, టీడీపీ అధికారంలోకి రాగానే అలాంటి అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగు యువత ఆధ్వర్యంలో రాళ్ళబూదుగూరు వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు వి.కోట మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రనాయుడు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు సుబ్బన్న, రాంబాబు, మోహన్‌రావు, సోము, ఈశ్వర్, శబరీష్, భక్తా, దామోదర్‌నాయుడు, విశ్వనాథ్, గుణ, హరి, చంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి, త్యాగరాజ్, ఫయాజ్, శ్రీనివాసులు, మునిరత్నం, నారాయణ పాల్గొన్నారు.