ఎయిడెడ్‌ పాఠశాలల విలీనం తగదు

ABN , First Publish Date - 2021-10-30T05:08:45+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఎయిడెడ్‌ పాఠశాలలను విలీనం చేయడం తగదని రేణిగుంట ఆర్‌సీఎం ఉన్నత పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధర్నా చేశారు.

ఎయిడెడ్‌ పాఠశాలల విలీనం తగదు
ధర్నా చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు

రేణిగుంట, అక్టోబరు 29: ప్రభుత్వ పాఠశాలల్లో ఎయిడెడ్‌ పాఠశాలలను విలీనం చేయడం తగదని పాత చెక్‌పోస్టు వద్ద ఉన్న ఆర్‌సీఎం ఉన్నత పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక రహదారిలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయంతో దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లాలంటే పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తుందని వాపోయారు. పాలకులు స్పందించి విలీనం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు విద్యాశాఖ అధికారులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

Updated Date - 2021-10-30T05:08:45+05:30 IST