అయ్యో పాపం...! శంకరయ్య

ABN , First Publish Date - 2021-05-21T06:05:18+05:30 IST

పాపం శంకరయ్య. పరీక్ష కోసం వస్తే ప్రాణాలు పోయాయి. కళ్ల ముందే కుటుంబ పెద్ద ప్రాణాలు పోవడంతో ఆ కుటుంబ సభ్యులు తల్లడిల్లి పోయారు.

అయ్యో పాపం...! శంకరయ్య
ఎంపేడు పీహెచ్‌సీలో మృతి చెందిన శంకరయ్య

శ్రీకాళహస్తి, మే20: పాపం శంకరయ్య. పరీక్ష కోసం వస్తే ప్రాణాలు పోయాయి. కళ్ల ముందే కుటుంబ పెద్ద ప్రాణాలు పోవడంతో ఆ కుటుంబ సభ్యులు తల్లడిల్లి పోయారు. ఈ విషాదకర సంఘటన గురువారం శ్రీకాళహస్తి మండలంలో జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలు... శ్రీకాళహస్తి మండలం ఎర్రమరెడ్డిపల్లెకు చెందిన శంకరయ్య(65) ఇటీవల అనారోగ్యం బారిన పడ్డాడు. రెండు రోజులుగా ఆయాసంగా ఉండటంతో కొవిడ్‌ పరీక్ష చేసుకోవడానికి ఎంపేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. పరీక్షల కోసం అక్కడ కొద్దిసేపు కూర్చున్నాడు. ఆ తరువాత వైద్య సిబ్బంది వచ్చి బీపీ, షుగర్‌ పరీక్షలు చేస్తుండగానే శంకరయ్య తుదిశ్వాస విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. శంకరయ్య మృత దేహానికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. కొవిడ్‌ నిబంధనల మేరకు ఆస్పత్రి సిబ్బంది శంకరయ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.Updated Date - 2021-05-21T06:05:18+05:30 IST