రెమ్డెసివిర్ పేరిట అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు
ABN , First Publish Date - 2021-05-08T07:08:44+05:30 IST
రెమ్డెసివిర్ ఇంజెక్షన్ పేరిట సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే

చిత్తూరు, మే 7:రెమ్డెసివిర్ ఇంజెక్షన్ పేరిట సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎం.హరినారాయ ణన్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయక ఒక ప్రకటన విడుదల చేశారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అతి తక్కువ ధరకే కలెక్టరేట్లో లభ్యమవు తుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇది నిజం కాదన్నారు. ఈ ఇంజెక్షన్ జిల్లాలోని ఆస్పత్రుల్లో మాత్రమే దొరుకుతుందని, వైద్యుల సూచన మేరకే వాటిని అందించడం జరుగుతుందన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై విచారించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.