ఇండిగో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి : సీపీఐ నేత నారాయణ
ABN , First Publish Date - 2021-12-15T07:23:36+05:30 IST
ఇండిగో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

తిరుపతి(కల్చరల్), డిసెంబరు 14 : ఇండిగో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విమాన ప్రయాణికులను తిరుపతిలో దింపాల్సిన బాధ్యత ఇండిగో యాజమాన్యాదినేనన్నారు. అలా కాకుండా ప్రయాణికులను బెంగళూరు విమానాశ్రయంలో దింపి రూ. 5వేలు చెల్లించాలని కోరడం క్రిమినల్ చర్యగా భావించి కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.